DetroitCampaign-teamGogineni

విలక్షణ వ్యక్తిత్వం.. సేవాతత్పరత.. కలగలిస్తే శ్రీనివాస గోగినేని

ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే అతను పెరిగిన నేపథ్యం, ప్రాంతం, చేసే పని.. నలుగురితో మసలుకునే విధానం పరిశీలిస్తాం. తానా ఎన్నికల్లో పోటీచేస్తున్న శ్రీనివాస గోగినేని స్వదేశం గురించి, సామాజిక సేవ గురించి బాగా ఆలోచిస్తారు. మెట్రో డిట్రాయిట్ మిచిగాన్ లో నివసించే శ్రీనివాస గోగినేని తన విలక్షణమైన వ్యక్తిత్వం, అపారమయిన అనుభవంతో పాటు ‘తానా’ పై అంకిత భావంతో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పుట్టిపెరిగిన ఈయన అందుకుతగినట్లుగా అమెరికాకు రాకు ముందు 13 సంవత్సరాలపాటు పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జిల్లావ్యాప్తం పలు గ్రామాలకు సేవలందించి మాతృదేశం ఋణం తీర్చుకున్నారు. అమెరికాకు వలసివచ్చిన తదుపరి గత 20 ఏళ్లుగా తన సేవలతో ‘తానా’ సభ్యులకు ఆయన సుపరిచితుడే కాక గ్రామీణ ప్రాంతాలపై మక్కువతో “మనఊరికోసం” అనే కార్యక్రమాన్ని రూపొందించి చేసిన సేవలు అయన పట్టుదల అకుంఠిత దీక్షలకు దర్పణం . గతంలో ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ గాను, 2015 ‘తానా’ కాన్ఫరెన్స్ కార్యదర్శి గాను ఇంకా అనేక ఇతర హోదాలలో నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించి మన్ననలు పొందారు.

srinivas-gogineni

గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ‘తానా’ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమి పొంది నప్పటికీ ఎన్నికల ప్రత్యర్థులతో కూడా కలసి మెలసి ఉంటూ . తానా సభ్యులకు, అమెరికాలో ఉండే ఎన్నారైలకు, స్వదేశంలో ఉండే నిరుపేద విద్యార్ధులకు సేవలు అందించారు.తెలుగు భాషకు, సంస్కృతికి మరియు ప్రజలకు సేవ చేయాలనే తపన తో పెద్దలు ఏర్పాటు చేసిన ‘తానా’ సంస్థకు ప్రస్తుత నాయకత్వం ఆధిపత్య ధోరణిపై, బాలట్ కలెక్షన్లతో ఎన్నికల రిగ్గింగ్ పై అలుపెరగని పోరాటం చేసినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో మూడు వర్గాలతోను సఖ్యతగా ఉండగలగడం ఈయనకే సాధ్యపడిందంటున్నారు. గోగినేని తన వ్యక్తిగత సంభాషణలలో అందరిని కలుపుకుని పోతానంటున్నారు.

క్లీన్ ఇమేజ్, సీనియర్ గా గుర్తింపు, అన్ని వర్గాలతోనూ నాయకులతోనూ వ్యక్తిగత సత్సంబంధాలు, ఫౌండేషన్ చైర్మగా నిర్వహించిన మన ఊరి కోసం కార్యక్రమం మూలంగా అమెరికా వ్యాప్తంగా తెచ్చుకున్న కీర్తి, ప్రలోభాలకు ఒత్తిడికి లొంగని వ్యక్తిత్వం, రెండు సార్లు అధ్యక్ష పదవికి పోటీ మూలంగా వచ్చే గుర్తింపు మరియు సానుభూతి ఆయన పట్ల వున్న సానుకూల ధోరణి. తను గెలవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఆయనకు నచ్చని అంశంగా చెప్పుకోవాలి.పూర్తి స్థాయి పనెల్ తో పాటు అనేకమంది పూర్వ అధ్యక్షుల మరియు సీనియర్ నాయకుల తోడ్పాటుతో ఈసారి ఎన్నికల్లో గెలుపుపై ఆయన ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నారు.

శ్రీనివాస గోగినేని గురించి...

  • పుట్టింది విజయవాడ, కృష్ణా జిల్లా
  • పాఠశాల విద్య కంకిపాడు, పునాదిపాడు, గొల్లపల్లి జెడ్నీ స్కూల్స్ కృష్ణా జిల్లా
  • ఇంటర్మీడియెట్ విద్య సీఆర్ రెడ్డి కాలేజ్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా
  • బీటెక్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భోపాల్
  • ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ ఎన్ఐటీ, భోపాల్ 1981-82
  • ఎంఎస్ సివిల్ ఇంజనీరింగ్, జెఎన్టీయూ, హైదరాబాద్
  • సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ 1983-86
  • డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీ రాజ్, ఏపీ గవర్నమెంట్ 1986-98 (పశ్చిమగోదావరి జిల్లా మరియు హైదరాబాద్)
  • ప్రెసిడెంట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్, 1991-93, పశ్చిమగోదావరి జిల్లా
  • సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ అమెరికా 1999-2011
  • ఐటీ కన్పల్టెంట్ కంపెనీ సీఈవో 2011-ఇప్పటివరకూ
  • ప్రస్తుత నివాసం వెస్ట్ బ్లూంఫీల్డ్, మియామీ, అమెరికా

గతంలో శ్రీనివాస గోగినేని నిర్వహించిన పదవులు

  • తానా ఫౌండేషన్ ఛైర్మన్ 2015-17
  • తానా ఫౌండేషన్ ప్రాజెక్ట్స్ అడ్వైజర్ 2017-19
  • 20వ తానా కాన్ఫరెన్స్ సెక్రటరీ 2015
  • తానా ఫౌండేషన్ సెక్రటరీ 2013-15
  • తానా ఫౌండేషన్ ట్రెజరర్ 2011-13
  • తానా ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ 2009-11
  • తానా బోర్డ్ మెంబర్ 2009-17
  • తానా ఫౌండేషన్ ట్రస్టీ 2009-17
  • తానా ఈసీ మెంబర్ 2015-17
  • తానా బైలాస్ కమిటీ మెంబర్ 2015-17
  • తానా మెంబర్ షిప్ వెరిఫికేషన్ కమిటీ (ఎంవీసీ) మెంబర్ 2015-17
  • తానా డోనార్ మెంబర్
  • తానా ఫౌండేషన్ మెంబర్

శ్రీనివాస గోగినేని గతంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు

  • మన ఊరి కోసం’ అనే నినాదం ద్వారా తానా ఫౌండేషన్ చైర్మన్ గా ఉంటూ అమెరికాలోని 20 ప్రధాన నగరాలలో 5కె రన్\వాక్ అన్నీ తానై నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి కోట్లాది రూపాయలు సమీకరించి ఆ మొత్తాన్ని ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగురాష్ట్రాల ప్రజల సేవ కార్యక్రాలపై ఉపయోగించి అనేకమందిచే ప్రశంసలు అందుకున్నారు
  • డిట్రాయిట్ లో 2015 లో జరిగిన తానా కాన్ఫరెన్స్ నకు సెక్రటరీ గా పనిచేస్తూ సుమారు 400పైగా వాలంటీర్‌లతో అనేక కమిటీలను సమన్వయం చేసి విజయానికి ముఖ్య కారకులయ్యారు
  • విజయవాడ లో ఆంధ్రప్రదేశ మరియు హైదరాబాద్ లో జరిగిన 2016 తానా రాష్ట్ర స్థాయి హైస్కూల్ స్కాలర్‌షిప్ చెస్ టోర్నమెంట్‌.ను ఫౌండేషన్ చైర్మన్ హోదాలో జయప్రదంగా నిర్వహించి అనేక వందలమంది విద్యార్థులకు నగదు పురస్కారాలను అందచేశారు
  • 2016 లో తానా ఫౌండేషన్ చైర్మన్గా ఒకే రోజున విశాఖపట్నంలో 100 మంది బాల బాలికలకు రికార్డు స్థాయిలో క్లెఫ్ట్ లిప్ సర్జరీలు చేయించి మన్ననలు అందుకున్నారు
  • కృష్ణా పుష్కరాల ద్వారా 2016లో వేలాదిమందికి సహాయం చేయడానికి నాయకత్వం వహించి AP ప్రభుత్వ అవార్డు అందుకున్నారు.
  • డెట్రాయిట్ లేడీస్ నైట్“కి ప్రధాన మద్దతుదారుగా 2014లో మయూర సఖి ద్వారా దిగ్విజయంగా నిర్వహించి మిగులు నిధులతో 20 మంది బాలికలకు క్లెఫ్ట్ లిప్ సర్జరీలు చేయించి అందరి చేత ప్రశంసలు పొందారు.
  • ప్రాజెక్ట్ వారధి నిర్వహణతోపాటు స్వయంగా పర్యవేక్షించి 550+ అనాథ పిల్లలకు 2013-17 లో వివిధ హోదాలలో ముఖ్య పాత్ర వహించారు
  • 2002 నుంచి 2023 వరకు వివిధ హోదాలలో అనేక క్యాన్సర్, కంటి, గుండె, దంత, మధుమేహ ఆరోగ్య శిబిరాల అమలులో శ్రీనివాస గోగినేని ప్రధాన పాత్ర పోషించారు. వీటి నిర్వహణకు అవసరమయిన విరాళాలు సేకరించడం, కొన్నింటికి స్వయంగా విరాళలు ఇస్తూ సమర్థంగా నిర్వహించారు.
  • 2016లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ & తానా ఫౌండేషన్‌తో ఏకకాలంలో వేలాది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీన్ క్యాంప్ను తానా ఫౌండేషన్ చైర్మన్ గా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
  • అనేక ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీల ఏర్పాటు, నిర్వహణకు, మరియు స్కాలర్‌షిప్‌ల విరాళాల సేకరణకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టారు. కొన్నిటికి విరాళాలు అందించారు.
  • తానా మరియు డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా 2013, 2015 లలో రెండుసార్లు వాలీబాల్ / త్రో బాల్ బాల్ పోటీలు నిర్వహించి మిగులు నిధులతో సేవాకార్యక్రమాలు చేసారు
  • పాఠశాల ను డిట్రాయిట్ లోని రెండు ప్రధానగరాలలో 2015 లో నిర్వహించి బాలబాలికలకు తెలుగు నేర్పించారు
  • తానా ఫౌండేషన్ మరియు తానా కు విరాళాలు ఇచ్చి తానా మరియు తానా ఫౌండేషన్ డోనార్ మెంబెర్ గా కూడా ఉన్నారు
  • ప్రారంభం నుంచి తానా టీమ్ స్క్వేర్ మెంబర్ గా తనవంతు సేవలు అందిస్తూనే వున్నారు.
  • ఇంకా 20 సంవత్సరాలుగా అనేక తానా కార్యక్రమాలకు స్వచ్చంద వాలంటీరుగా సేవలందిస్తున్నారు

శ్రీనివాస గోగినేని నిబద్దత, నిజాయితీ మరియు సేవాతత్పరత తానాకు అవసరం

శ్రీనివాస గోగినేని మాటలు చెప్పడం కంటే వాటిని ఆచరణలో చూపించాలి అని నమ్మే వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అమెరికాలోను తన సేవా తత్పరతను చాటుకున్నారు. శ్రీనివాస గోగినేని తన గురించి, తన ఉద్దేశాలు, లక్ష్యాలు గురించి ఏమంటున్నారో చూద్దాం ..

మిత్రులారా.. ఎందరో మహనీయుల మార్గదర్శనం మరియు నాయకత్వం లో గత 46 సంవత్సరాలుగా తానా సంస్థ తెలుగు ప్రజల భాషకు మరియు సంస్కృతికి విశేష కృషి చేయడం మిక్కిలి గర్వ కారణం. అమెరికా వచ్చిన కొద్ది నెలలలోనే తానా సేవా కార్యక్రమాల వాలంటీర్ గా ప్రారంభమైన నేను …. తానా సంస్థ లో మీ అందరి సహకారంతో వివిధ పదవులను ఎంతో బాధ్యతతో చేపట్టి అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ మరియు తోడ్పాటు నిర్విరామంగా పాటుపడుతున్నాను.

తానా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా అమెరికాలో వుండే మన తెలుగు వారికి మరింత సేవ చేయాలని, అందుకు ముందుగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ. 2015-17 తానా ఫౌండేషన్ చైర్మన్ గా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూనే రాబోయే కాలానికి మార్గదర్శకంగా ఉంటూ తానా ప్రఖ్యాతిని అమెరికా మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింతగా చేరువ చేసే ” మన ఊరి కోసం ” 5K Run/ Walk ను 20ప్రముఖనగరాలలో విజయవంతంగా నిర్వహించాను. తానా రాష్ట్ర స్థాయి చెస్ స్కాలర్షిప్ టోర్నమెంట్ ద్వారా తెలంగాణ ఆంధ్రరాష్ట్రాలలోని వందలమంది స్కూల్ విద్యార్థులకు ఆర్ధిక సాయం, వందలాది బాల బాలికలకు రికార్డు స్థాయిలో క్లెఫ్ట్ లిప్ సర్జరీలు, అనేక క్యాన్సర్, కంటి, గుండె, దంత, మధుమేహ ఆరోగ్య శిబిరాల అమలు, అనేక ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీల ఏర్పాటు, మరియు స్కాలర్‌షిప్‌లు తో పాటు కృష్ణా పుష్కర సేవ వంటి నూతన కార్యక్రమాల ద్వారా వివిధ కార్యక్రమాల రూపకల్పన మరియు నిర్వహణ చేయ గలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతే కాకుండా తానా 20 వ మహాసభల కార్యదర్శిగా డెట్రాయిట్ నగరంలో 400 పైగా కార్యకర్తలను సమన్వయము చేస్తూ విజయవంతం కావటానికి మిక్కిలి కృషి చేసాను.

పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒడిదుడుకులకులోనై అనేక మంది విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం నుంచి ప్రస్తుతం మరిన్ని ఉన్నత శిఖరాలు చేరిన తానా విజయ పధంలో ప్రముఖ నాయకులతో పాటు నా వంతు సహాయపడినందులకు మిక్కిలి సంతోషపడుతున్నాను. ఇదే సందర్భంలో కాలగమనంతో పాటు సమాజంలో మారుతున్న కొన్ని పరిస్థితులు, అనేక సంవత్సరాలుగా ఒకే వరవడిలో సాగిపోతే వచ్చే కొన్ని అలసత్వ లక్షణాలు, పెరుగుతూ వస్తున్న సంస్థ వెలపలి శక్తుల ప్రభావం కారణంగా మన ఈ తానా సంస్థ మనుగడ, నడవడిక మరియు భవిష్యత్తు పై అనేకమంది నాయకులు, వాలంటీర్లు, జీవిత సభ్యులు తమ ఆందోళన మరియు ఆలోచనలను నాతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో నా కర్తవ్యం నాకు బోధపడింది. తానా మనందరిది. దీనిని కాపాడు కోవాలని. ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగాను. అనేక మంది పూర్వ అధ్యక్షులు, సీనియర్ నాయకుల సహకారంతో పూర్తిస్థాయి పనెల్ తో “టీం గోగినేని” పేరుతొ మీ ముందుకు మీ ఆసిస్సులకై వస్తున్నాము

వేగంగా మారుతూ వస్తున్న ప్రస్తుత తరుణంలో సభ్యులందరినీ కలుపుకొంటూ, ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా కార్యక్రమాలు రూపొందించుకొంటూ తానా సంస్థ మనుగడ మరియు భవిష్యత్తు ను బలపరచ గలిగిన నాయకత్వం మిక్కిలి అవసరం. అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పలు పదవుల ద్వారా సముపార్జించిన అనుభవము, అవగాహన మరియు విస్తృత పరిచయాల కారణంగా ఈ నాయకత్వం చేయగలనని దృడంగా భావిస్తూ ఎంతో మంది శ్రేయోభిలాషుల సలహాలు మరియు తోడ్పాటుతో ప్రస్తుత తానా ఎన్నికలలో నిర్వాహక ఉపాధ్యక్షుడు (Executive Vice President President Elect) గా పోటీ చేస్తూ నాటో పాటు పోటీ చేస్తున్న :టీం గోగినేని” సభ్యులందరికీ మీ సహకారం మరియు ఓటు కొరకు సవినయముగా అర్ధిస్తున్నాను.

తానా ప్రస్తుత పరిపాలనా శైలిలో పలు సంస్కరణలు, విలువల పరిరక్షణ మరియు తెలుగు ప్రజలకు, భాషకు, సంస్కృతికి దోహదపడే పలు నూతన కార్యక్రమాలు నా భవిష్యత్ ప్రాధాన్యతలు. నా యొక్క గత అనుభవము, నిబద్ధత, నిర్వహణ సామర్ధ్యం లను బేరీజు వేసి మాకు ఓటు వేసి గెలిపించి తానా సంస్థను పరిరక్షిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలకై పాటుపడే అవకాశాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను. నిరంతరం మీకు సేవచేసే భాగ్యం కలిగిస్తారని కోరుకుంటున్నాను… అంటూ శ్రీనివాస గోగినేని తానా సభ్యులకు సందేశం పంపారు.

“వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌ – గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌” అంటూ వస్తున్నఇలాంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలి. తానా రూపురేఖలు మారుస్తానంటున్న శ్రీనివాస గోగినేని గారితో పాటు వారి “టీం గోగినేని” గెలుపునకు ప్రతిఒక్కరం కృషి చేద్దాం. నిజాయితీ. నిబద్దతతో మరియు సేవ తత్పరత లతో ముందుకు సాగుతున్న శ్రీనివాస గోగినేని ప్యానెల్ను అఖండ మెజారిటీ తో గెలవాలని కోరుకుందాం.

మీ మద్దతుతోనే సాధ్యం – టీమ్ గోగినేని ఎన్నికతో – తానా లో సరికొత్త శకానికి నాంది పలుకుదాం
#teamGogineni