శిరీష తూనుగుంట్ల

Treasurer

తెలుగువారి సేవలో శిరీష తూనుగుంట్ల

శిరీష తూనుగుంట్ల సేవా కార్యక్రమాలు

  • గృహ హింస సమస్యలతో సహాయం కోసం ఎవరు సంప్రదించినా వాటిని పరిష్కరించడంలో నేను ముందున్నాను.90 కి పైగా సమస్యలను పరిష్కరించాను. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలతో సమన్వయం చేయడం ద్వారా సమస్య పరిష్కారంతో పాటు వారికి అవసరమైన మద్దతును అందించాను.
  •  తానా ఫౌండేషన్ ద్వారా భారతదేశం మరియు USAలలో COVID-19 సహాయక చర్యలు చేపట్టాను.
  • మదర్స్ డే 2020 సందర్భంగా, “అమ్మా నీకు వందనం” అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
  • తానా – యంగ్ తరంగ్ 2020 – యువత సాధికారత కార్యకలాపాలకు మద్దతుగా విజయవాడ KL యూనివర్సిటీ క్యాంపస్‌లో కార్యక్రమం నిర్వహించాను.
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020 UNO సహకారంతో USA మరియు భారతదేశం నుండి అనేక మంది ప్రముఖులు పర్యావరణ-ఆకుపచ్చ నినాదాన్ని ప్రతిధ్వనిస్తూ పాల్గొన్నారు.
  • WTCF – వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 – 40+ దేశాలు మరియు 100+ సంస్థల నుండి 20,000+ మంది పాల్గొనే ప్రతిష్టాత్మక ఈవెంట్. ఈ కార్యక్రమం మనందరి సంతకం కార్యక్రమంగా మారింది. 10 లక్షల నిధులు సేకరించి చేనేత కార్మికులకు, కళాకారులకు సహాయం చేశాము
  • ఉపాధ్యాయ దినోత్సవం 2020 – సర్వేపల్లి రాధా కృష్ణ జయంతి సందర్భంగా ‘ఆర్యోక్తి ఆచార్య దేవో భవ’ స్మరణ కార్యక్రమం నిర్వహించాను.
  • జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాము.
  • తానా బంగారు బతుకమ్మ 2020 ద్వారా 2 లక్షల నిధులు సేకరించి క్యాన్సర్ రోగులకు సహాయం చేసాము.
  • సురభి డ్రామా ఫెస్టివల్ 2020 USA అంతటా అనేక ఇతర తెలుగు సంస్థల సహకారంతో నిర్వహించబడింది. సురభి కుటుంబాలు వారి కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడం ద్వారా నిధులను సేకరించడం ద్వారా రూ.6 లక్షల వరకు సహాయం చేసాము
  • అనేక ఇతర కార్యక్రమాలు ప్రారంభించి అమలు చేసాము. కోవిడ్-19పై భారతీయం సత్యవాణి కార్యక్రమం, న్యూయార్క్ మరియు భారతదేశంలో విరాళంగా అందించబడిన ఫ్రంట్ లైనర్స్ కిట్‌లు, మాస్క్‌లు, ఎకో గణేశ 2020, లక్కీ మహిళా 2020, యోగా 2020 – 200 రోజుల సెషన్ మొదలైనవి చేపట్టాము.
SIRISHA TUNUGUNTLA

శిరీష తూనుగుంట్ల

Treasurer

శిరీష తూనుగుంట్ల. తానా సర్వీస్ కో ఆర్డినేటర్ 2021-23

నా విజన్

  • తానాను పటిష్ట పర్చడం
  • తెలుగు సంస్కృతిని పెంపొందించడం
  • నిరుపేదలకు సాయం చేయడం

‘తానా’కు రెడ్‌క్రాస్‌ సేవా పతకాలు.. శిరీష తూనుగుంట్ల క్రియాశీలక పాత్ర

గతంలో నేను నిర్వహించిన సేవ కార్యక్రమాలు సంతృప్తిని ఇచ్చాయి. నేను చేపట్టిన కొవిడ్‌ సేవలకు గుర్తింపు లభించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ‘తానా’కు రెడ్‌క్రాస్‌ సేవా పతకాలు లభించాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితులకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా తానాతోపాటు సంఘం కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్లకు రెడ్‌క్రాస్‌ విశిష్ట సేవా పతకం లభించింది.

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA) సేవలకు మంచి స్పందన, అవార్డులు లభించాయి. కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితులకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా తానాతోపాటు సంఘం కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్లకు రెడ్‌క్రాస్‌ విశిష్ట సేవా పతకం వరించింది. విజయవాడ వేదికగా నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ పతకాలు అందజేశారు. తానా తరఫున సంఘం టీమ్స్‌ స్క్వేర్‌ ఛైర్‌ కాకర్ల సురేశ్‌, శిరీష తూనుగుంట్ల తరఫున ఆమె తండ్రి మిట్టపల్లి పాండురంగారావు ఈ పతకాన్ని స్వీకరించారు.

కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో బాధితులకు ఆస్పత్రి పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు‌, మందుల లభ్యత తదితర వివరాల అందజేతలో ‘తానా’ విశేష కృషి చేసింది. ఈ సేవా కార్యక్రమ నిర్వహణలో కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్ల కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌నూ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి సమన్వయంతో 40 వేల మెడికల్ కిట్లు, 650 ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లు, 120 వెంటిలేటర్స్ పంపిణీ చేసింది. నిత్యవసర సరకులు, మాస్కులు, ఇతరత్రా సామగ్రి అందజేసి ఎంతో మందిని ఆదుకుంది. ఈ సేవలకు గుర్తింపుగా రెడ్‌క్రాస్‌ సొసైటీ.. తానా సంస్థకు, శిరీష తూనుగుంట్లకు విశిష్ట సేవా గోల్డ్ మెడల్స్ ప్రకటించింది. విదేశాల్లో ఉంటూ.. మాతృదేశంలో ప్రజలకు ఆపద, అవసరాల్లో మేమున్నామని ముందుకొచ్చిన సేవామూర్తులకు దక్కిన గుర్తింపు ఇదని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో శిరీష తూనుగుంట్లకు క్రియాశీలకంగా వ్యవహరించారు.

తార ఆర్ట్స్ అకాడమీ సన్మానం… “జరుగుతున్న కథలు” పుస్తక ఆవిష్కరణ

గత ఏడాది మే 5, 2022 న తానా సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల అభినందన సభ, ‘జరుగుతున్న కథలు’ స్వీయ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మే నెల 5 వ తేది సికింద్రాబాద్ “ఇన్క్రెడిబుల్ వన్ కన్వేషన్” లో “తార ఆర్ట్స్ అకాడమీ” ఆధ్వర్యంలో తానా సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి శిరీష తూనుగుంట్ల గారిని ఘనంగా సన్మానించి వారు స్వయంగా రచించిన “జరుగుతున్న కథలు” పుస్తక ఆవిష్కరణ వైభవంగా జరిపించి శిరీష గారు చేస్తున్న అనేక సేవల గురించి వివరించారు.

కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర బి. సి. కమిషన్ చైర్మన్ శ్రీ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు గారు, విశిష్ట అతిథులు గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పూర్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ విజయ్ భాస్కర్ గారు, మరియు ప్రఖ్యాత సీనియర్ సిని నటి రోజా రమణి గారు, శిరీష గారి ఖ్యాతిని అద్భుతంగా కొనియాదారు. శిరీష గారు తెలుగు జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమ గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందాలని “తార ఆర్ట్స్ అకాడమీ” సభ్యులు కోరుకున్నారు. శిరీష తూనుగుంట్ల గారిని తమ సంస్థ తార ఆర్ట్స్ అకాడమీ ఆత్మీయంగా సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.