ఫౌండేషన్ ట్రస్టీస్
రవి సామినేని
ఫౌండేషన్ ట్రస్టీ
తనసేవలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రవి సామినేని
సేవే లక్ష్యంగా రవి సామినేని తానాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రవి సామినేని తానాలో అనేక సేవలు అందించారు. తనకు లభించిన పదవులకు వన్నె తెస్తూ ముందుకు సాగుతున్నారు.
2019-2023: తానా ఫౌండేషన్ ట్రస్టీ గా పనిచేశారు.
2017-2019: తానా ఫౌండేషన్ 5k వాక్ నేషనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు.
2015-2017 సెంట్రల్ కోఆర్డినేటర్ గా,
2015-2017 ప్రెసిడెంట్ TACO (తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహియో)
1999: ప్రెసిడెంట్ ACES (అసోసియేషన్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్), VRSEC (VR సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ విజయవాడ)గా వ్యవహరించారు.
కీలక ప్రాజెక్ట్‌లు & సాధించిన విజయాలు
వికలాంగుల సాధికారత కోసం రవి సామినేని చేసిన సేవా కార్యక్రమాలు గుర్తింపు పొందాయి. తెలంగాణ రాష్ట్ర అవార్డుతో సత్కరించింది. Honored 202 FIA (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్) అవార్డు. తానా ఫౌండేషన్ ఆదరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, దాతల సహాయంతో లక్ష డాలర్లుకు పైగా సేకరించారు. 250+ శారీరక వికలాంగులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లను అందించారు. 500+ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు 250+ ల్యాప్‌టాప్‌లను అందించారు.
రవి సామినేని దాతల సహాయంతో గ్రామీణ ప్రాంత బాలికల కోసం 500+ సైకిళ్లను పంపిణీ చేశారు. ఒహియో లోయ ప్రాంతంలో మొట్టమొదటి తానా మహిళల క్రికెట్‌ను విజయవంతంగా నిర్వహించారు. తానా ఫౌండేషన్ 5k వాక్ కంటెస్ట్ లను నిర్వహించడం ద్వారా లక్ష డాలర్లు సేకరించి అందించారు. 2017-2019లో భారతదేశంలో 50+ CPR ప్రోగ్రామ్‌లను నిర్వహించింది. కరోనా మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు మాస్క్‌లు/షీల్డ్‌లు మరియు ఆహారాన్ని అందించారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే రవి సామినేని సేవ చేయడం అలవాటుగా మారితే అది ఇచ్చే తృప్తి అనంతమైనది అని నమ్ముతారు. తనను ఫౌండేషన్ సెక్రటరీగా గెలిపించి మరింత సేవ చేసే అవకాశం కల్పించమంటున్నారు
సుమంత్ రాంశెట్టి
ఫౌండేషన్ ట్రస్టీ
దినేష్ త్రిపురనేని
ఫౌండేషన్ ట్రస్టీ
రాంప్రసాద్ చిలుకూరి
ఫౌండేషన్ ట్రస్టీ
లక్ష్మణ్ పర్వతనేని
ఫౌండేషన్ ట్రస్టీ
