వెంకటరమణ యార్లగడ్డ
తానాలో అనేక పదవులు నిర్వహించారు వెంకటరమణ యార్లగడ్డ. ప్రస్తుతం ఆయన తానా ఎన్నికల్లో శ్రీనివాస గోగినేని ప్యానెల్ లో బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా పోటీచేస్తున్నారు. గతంలో అనేక పదవులు, సేవా కార్యక్రమాలు చేపట్టారు వెంకటరమణ యార్లగడ్డ. 2021-2023లో తానా ఫౌండేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2019-2021 – ఫౌండేషన్ ట్రస్టీగా చేశారు. 2011-2013-ఫౌండేషన్ ట్రస్టీ గా బాధ్యతలు చేపట్టారు. 2009-2011- సెక్రటరీగా, TANA-ట్రస్టీ 2009-2010 Foundation అధ్యక్షుడు గా పనిచేశారు.
ప్రస్తుతం – వ్యవస్థాపక ట్రస్టీ, తానా ఫౌండేషన్ గా కొనసాగుతున్నారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 200+ ఫౌండేషన్ క్యాంపులను నిర్వహించారు. 24 నెలల్లో తానా ఫౌండేషన్ కోసం 2.5 మిలియన్ డాలర్లకు పైగా సేకరించారు. 100+ ఫౌండేషన్ డోనర్ మెంబర్‌షిప్‌లను పెంచారు. 50కి పైగా నేత్ర శిబిరాలు నిర్వహించారు. నిరంతరం సేవా కార్యక్రమాలతో ఆయన బిజీబిజీగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోని ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలల్లో 50+ CPR శిబిరాలను ఆయన నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో 50+ క్యాన్సర్ అవగాహన శిబిరాలను నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
వెంకటరమణ యార్లగడ్డ
2022లో రికార్డు స్థాయిలో 1000+ లబ్ధిదారులతో మెగా హెల్త్ క్యాంపులను నిర్వహించారు. గత 20 నెలల్లో 1 కోటి రూపాయల మొత్తంలో పేద విద్యార్థులకు 1000+ స్కాలర్ షిప్ లు అందించి సాయం చేసారు. పేద విద్యార్థులకు 250 ల్యాప్‌టాప్‌లు, మహిళలకు 500 కుట్టు మిషన్లు, వికలాంగులకు త్రిచక్ర వాహనాలు, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు రగ్గులు, ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల బెంచీలు, ఇంకా మరెన్నో చేపట్టారు. ఆదరణ కార్యక్రమం కింద 50కి పైగా శిబిరాలు నిర్వహించారు.పేద రైతుల కోసం ట్రాక్టర్లు మరియు దాతల ద్వారా గ్రామీణ ఏరియా ఆసుపత్రులకు అంబులెన్స్‌లను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలు మరియు హెచ్‌ఐవి రోగులకు ఉచిత పౌష్టికాహారం అందించడానికి “అన్నపూర్ణ” అనే కొత్త ఫౌండేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు, దివ్యాంగులకు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం మరియు విజయవంతంగా అమలు చేయడం కోసం కొత్త ఫౌండేషన్ ప్రాజెక్ట్ “అరణ్య”ను ప్రారంభించారు వెంకటరమణ యార్లగడ్డ. 2011లో ఫౌండేషన్ కార్యదర్శిగా తానా ఫౌండేషన్ ఇండియాను ప్రారంభించారు. తనను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నుకుంటే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానంటున్నారు వెంకటరమణ యార్లగడ్డ.
