శ్రీనివాసరావు ఉయ్యూరు
శ్రీనివాసరావు ఉయ్యూరు తానా సభ్యులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం తన సేవా కార్యక్రమాలతో తానా సభ్యులతో పాటు తెలుగురాష్ట్రాల ప్రశంసలు పొందారు. 2021 to 2023 లో ఎగ్జిక్యూటివ్ కమిటీ (రీజినల్ రిప్రజెంటేటివ్స్) గా వ్యవహరించారు. తానా ఎన్నికల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పోటీచేస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు.. తమ స్వదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సేవలందించేందుకు ముందుకొస్తున్నారు. తమ సంపాదన నుంచి సేవా కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా విదేశీ విద్యకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు. మూడు చోట్ల సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. అమెరికాలోని వర్జీనియాలో స్థిరపడిన ఉయ్యూరు శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా వేజెండ్లకు చెందినవారు. పేదలు, విద్యార్థులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూఎస్‌ఏ ఇన్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారా ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు.
శ్రీనివాసరావు ఉయ్యూరు
గ్రామీణ విద్యార్థులకు వ్యవసాయ భూములపై విద్యారుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీంతో అన్నీ ఉన్నా విదేశీ విద్యకు దూరమవుతున్నారు. అలాంటివారికి తనవంతు సాయం అందిస్తున్నారు ఉయ్యూరు శ్రీనివాసరావు. తాను స్థాపించిన ఉయ్యూరు ఫౌండేషన్ తరపున సాయం చేస్తున్నారు. విదేశాల్లో చదువుకోవాలనునుకునే ఒక్కో విద్యార్థికి రెండేళ్ల చదువుకు అవసరమయ్యే 50వేల డాలర్లను ఆయన అందిస్తారు. చదువు పూర్తయి.. ఉద్యోగంలో చేరాక వారు అసలును తిరిగి చెల్లించవచ్చు. 2022 మే 28న ప్రారంభించిన కార్యక్రమం ద్వారా తొలి ఏడాది 20 మందికి రుణాలు ఇచ్చారు ఉయ్యూరు శ్రీనివాసరావు.
పేదలకు తన వంతుగా అన్నదానం చేయాలనే లక్ష్యంతో గుంటూరు నగరంలో 2, హిందూపురంలో 1 చొప్పున అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి రోజూ 500 మందికి ఆహారం అందిస్తున్నారు. అన్నంతో పాటు పప్పు కూర, రోటి పచ్చడి, సాంబారు, ఒక మిఠాయి, పెరుగును వడ్డిస్తున్నారు. తాను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలో పేదలను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలను శ్రీనివాసరావు చేపట్టారు. దసరా సమయంలో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు పరీక్షలు నిర్వహించారు. అన్నగారి జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకల ద్వారా పేదలకు చేయూత ఇవ్వాలనే ఆలోచనతో.. సుమారు 18వేల మందికి అందించారు. గుంటూరులో మొబైల్ అంబులెన్స్ ద్వారా మురికి వాడల్లో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఉయ్యూరు శ్రీనివాసరావు. అక్కడ వైద్యుడితోపాటు ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో శుద్ధ జల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు ఉయ్యూరు శ్రీనివాసరావు. తెలుగు భాష అభివృద్ధికి గ్రంథాలయాల ఏర్పాటు, వేసవిలో క్రీడా శిబిరాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు ఉయ్యూరు శ్రీనివాసరావు. తానా సభ్యులకు, తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తనను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నుకోవాలని ఉయ్యూరు శ్రీనివాసరావు కోరుతున్నారు.
