AP_Gobt_Award

విలక్షణ వ్యక్తిత్వం.. సేవాతత్పరత.. కలగలిస్తే శ్రీనివాస గోగినేని

ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే అతను పెరిగిన నేపథ్యం, ప్రాంతం, చేసే పని.. నలుగురితో మసలుకునే విధానం పరిశీలిస్తాం. తానా ఎన్నికల్లో పోటీచేస్తున్న శ్రీనివాస గోగినేని స్వదేశం గురించి, సామాజిక సేవ గురించి బాగా ఆలోచిస్తారు. మెట్రో డిట్రాయిట్ మిచిగాన్ లో నివసించే శ్రీనివాస గోగినేని తన విలక్షణమైన వ్యక్తిత్వం, అపారమయిన అనుభవంతో పాటు ‘తానా’ పై అంకిత భావంతో పనిచేస్తున్నారు. తన సేవలతో ‘తానా’ సభ్యులకు ఆయన సుపరిచితుడు.గతంలో ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ గాను, 2015 ‘తానా’ కాన్ఫరెన్స్ కార్యదర్శి గాను నిర్వహించిన పదవులకు వన్నె తెచ్చారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించారు.

2017, 2021లలో స్వతంత్ర అభ్యర్థిగా ‘తానా’ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమి పొందారు. కానీ పదవులే కాదు స్వతంత్రంగా కూడా తానా సభ్యులకు, అమెరికాలో ఉండే ఎన్నారైలకు, స్వదేశంలో ఉండే నిరుపేద విద్యార్ధులకు సేవలు అందించారు.తెలుగు భాషకు, సంస్కృతికి మరియు ప్రజలకు సేవ చేయాలనే తపన తో పెద్దలు ఏర్పాటు చేసిన ‘తానా’ సంస్థకు ప్రస్తుత నాయకత్వం ఆధిపత్య ధోరణిపై, బాలట్ కలెక్షన్లతో ఎన్నికల రిగ్గింగ్ పై అలుపెరగని పోరాటం చేసినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో మూడు వర్గాలతోను సఖ్యతగా ఉండగలగడం ఈయనకే సాధ్యపడిందంటున్నారు. గోగినేని తన వ్యక్తిగత సంభాషణలలో అందరిని కలుపుకుని పోతానంటున్నారు.

క్లీన్ ఇమేజ్, సీనియర్ గా గుర్తింపు, అన్ని వర్గాలతోనూ నాయకులతోనూ వ్యక్తిగత సత్సంబంధాలు, ఫౌండేషన్ చైర్మగా నిర్వహించిన మన ఊరి కోసం కార్యక్రమం మూలంగా అమెరికా వ్యాప్తంగా తెచ్చుకున్న కీర్తి, ప్రలోభాలకు ఒత్తిడికి లొంగని వ్యక్తిత్వం, రెండు సార్లు అధ్యక్ష పదవికి పోటీ మూలంగా వచ్చే గుర్తింపు మరియు సానుభూతి ఆయన పట్ల వున్న సానుకూల ధోరణి. అయితే ఏ వర్గానికి పూర్తిగా చెందకపోవడం, సొంతంగా సభ్యులను చేర్పించుకోవడంపై వ్యతిరేకత, గ్రూప్/వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే శైలి, రెండు సార్లు పోటీ చేసి ఓటమి పొందడం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. తను గెలవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఆయనకు నచ్చని అంశంగా చెప్పుకోవాలి.ఈసారి ఎన్నికల్లో గెలుపుపై ఆయన ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *