శ్రీనివాస గోగినేని మాటలు చెప్పడం కంటే వాటిని ఆచరణలో చూపించాలి అని నమ్మే వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అమెరికాలోను తన సేవా తత్పరతను చాటుకున్నారు. శ్రీనివాస గోగినేని తన గురించి, తన ఉద్దేశాలు, లక్ష్యాలు గురించి ఏమంటున్నారో చూద్దాం ..
మిత్రులారా.. ఎందరో మహనీయుల మార్గదర్శనం మరియు నాయకత్వం లో గత 46 సంవత్సరాలుగా తానా సంస్థ తెలుగు ప్రజల భాషకు మరియు సంస్కృతికి విశేష కృషి చేయడం మిక్కిలి గర్వ కారణం. అమెరికా వచ్చిన కొద్ది నెలలలోనే తానా సేవా కార్యక్రమాల వాలంటీర్ గా ప్రారంభమైన నేను …. తానా సంస్థ లో మీ అందరి సహకారంతో వివిధ పదవులను ఎంతో బాధ్యతతో చేపట్టి అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ మరియు తోడ్పాటు నిర్విరామంగా పాటుపడుతున్నాను.
తానా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా అమెరికాలో వుండే మన తెలుగు వారికి మరింత సేవ చేయాలని, అందుకు ముందుగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ. 2015-17 తానా ఫౌండేషన్ చైర్మన్ గా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూనే రాబోయే కాలానికి మార్గదర్శకంగా ఉంటూ తానా ప్రఖ్యాతిని అమెరికా మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింతగా చేరువ చేసే ” మన ఊరి కోసం ” 5K Run/ Walk ను 20ప్రముఖనగరాలలో విజయవంతంగా నిర్వహించాను. తానా రాష్ట్ర స్థాయి చెస్ స్కాలర్షిప్ టోర్నమెంట్ ద్వారా తెలంగాణ ఆంధ్రరాష్ట్రాలలోని వందలమంది స్కూల్ విద్యార్థులకు ఆర్ధిక సాయం, వందలాది బాల బాలికలకు రికార్డు స్థాయిలో క్లెఫ్ట్ లిప్ సర్జరీలు, అనేక క్యాన్సర్, కంటి, గుండె, దంత, మధుమేహ ఆరోగ్య శిబిరాల అమలు, అనేక ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీల ఏర్పాటు, మరియు స్కాలర్‌షిప్‌లు తో పాటు కృష్ణా పుష్కర సేవ వంటి నూతన కార్యక్రమాల ద్వారా వివిధ కార్యక్రమాల రూపకల్పన మరియు నిర్వహణ చేయ గలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతే కాకుండా తానా 20 వ మహాసభల కార్యదర్శిగా డెట్రాయిట్ నగరంలో 400 పైగా కార్యకర్తలను సమన్వయము చేస్తూ విజయవంతం కావటానికి మిక్కిలి కృషి చేసాను.
పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒడిదుడుకులకులోనై అనేక మంది విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం నుంచి ప్రస్తుతం మరిన్ని ఉన్నత శిఖరాలు చేరిన తానా విజయ పధంలో ప్రముఖ నాయకులతో పాటు నా వంతు సహాయపడినందులకు మిక్కిలి సంతోషపడుతున్నాను. ఇదే సందర్భంలో కాలగమనంతో పాటు సమాజంలో మారుతున్న కొన్ని పరిస్థితులు, అనేక సంవత్సరాలుగా ఒకే వరవడిలో సాగిపోతే వచ్చే కొన్ని అలసత్వ లక్షణాలు, పెరుగుతూ వస్తున్న సంస్థ వెలపలి శక్తుల ప్రభావం కారణంగా మన ఈ తానా సంస్థ మనుగడ, నడవడిక మరియు భవిష్యత్తు పై అనేకమంది నాయకులు, వాలంటీర్లు, జీవిత సభ్యులు తమ ఆందోళన మరియు ఆలోచనలను నాతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో నా కర్తవ్యం నాకు బోధపడింది. తానా మనందరిది. దీనిని కాపాడు కోవాలని. ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగాను. అనేక మంది పూర్వ అధ్యక్షులు, సీనియర్ నాయకుల సహకారంతో “గోగినేని ఫర్ తానా” పేరుతొ మీ ముందుకు మీ ఆసిస్సులకై వస్తున్నాము
వేగంగా మారుతూ వస్తున్న ప్రస్తుత తరుణంలో సభ్యులందరినీ కలుపుకొంటూ, ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా కార్యక్రమాలు రూపొందించుకొంటూ తానా సంస్థ మనుగడ మరియు భవిష్యత్తు ను బలపరచ గలిగిన నాయకత్వం మిక్కిలి అవసరం. అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పలు పదవుల ద్వారా సముపార్జించిన అనుభవము, అవగాహన మరియు విస్తృత పరిచయాల కారణంగా ఈ నాయకత్వం చేయగలనని దృడంగా భావిస్తూ ఎంతో మంది శ్రేయోభిలాషుల సలహాలు మరియు తోడ్పాటుతో ప్రస్తుత తానా ఎన్నికలలో నిర్వాహక ఉపాధ్యక్షుడు (Executive Vice President President Elect) గా పోటీ చేస్తున్నాను. మీ సహకారం మరియు ఓటు కొరకు సవినయంగా అర్ధిస్తున్నాను.
తానా ప్రస్తుత పరిపాలనా శైలిలో పలు సంస్కరణలు, విలువల పరిరక్షణ మరియు తెలుగు ప్రజలకు, భాషకు, సంస్కృతికి దోహదపడే పలు నూతన కార్యక్రమాలు నా భవిష్యత్ ప్రాధాన్యతలు. నా యొక్క గత అనుభవము, నిబద్ధత, నిర్వహణ సామర్ధ్యం లను బేరీజు వేసి మాకు ఓటు వేసి గెలిపించి తానా సంస్థను పరిరక్షిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలకై పాటుపడే అవకాశాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను. నిరంతరం మీకు సేవచేసే భాగ్యం కలిగిస్తారని కోరుకుంటున్నాను… అంటూ శ్రీనివాస గోగినేని తానా సభ్యులకు సందేశం పంపారు.
“వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ – గట్టి మేల్ తలపెట్టవోయ్” అంటూ వస్తున్నఇలాంటి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలి. తానా రూపురేఖలు మారుస్తానంటున్న శ్రీనివాస గోగినేని “గోగినేని ఫర్ తానా” గెలుపునకు ప్రతిఒక్కరం కృషి చేద్దాం. నిజాయితీ. నిబద్దతతో మరియు సేవ తత్పరత లతో ముందుకు సాగుతున్న శ్రీనివాస గోగినేనిని అఖండ మెజారిటీ తో గెలవాలని కోరుకుందాం.
మీ మద్దతుతోనే సాధ్యం – గోగినేని ఎన్నికతో – తానా లో సరికొత్త శకానికి నాంది పలుకుదాం